తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని మూసేశారు. రాష్ట్రాలకు అదాయాన్ని అందించే మద్యం దుకాణలు సైతం మూతపడ్డాయి. గత నెల రోజులుగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో మందు షాపులు తెరుచుకోలేదు. దీంతో కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మందుబాబుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ మందును ఏకంగా రూ.800 కి అమ్ముతున్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు చేసేదిలేక అంత మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కరోనా సమయంలో నిరంతరంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నా, అడ్డదారుల్లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తూనే ఉన్నారు.