ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.