బ్రహ్మంగారి మఠాధిపత్యంపై గత కొన్నిరోజులుగా రగడ జరుగుతున్నది. పీఠాధిపత్యం తమకు కావాలంటే తమకు చెందాలని గొడవ పడుతున్నారు. ఈ వివాదంపై అటు వివిధ మఠాలు, పీఠాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఈ వివాదంపై ఈరోజు దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారి మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని, దేవాదాయ చట్టంప్రకారం 90 రోజుల్లో వీలునామా అందాలని అన్నారు. పీఠాధిపత్యంపై దేవాదాయశాఖ పరిధిలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. చారిత్రాత్మక పీఠంపై వివాదం చెయవద్దని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. చట్టం, సంప్రదాయం ప్రకారం పీఠాధిపతి ఎంపిక జరుగుతుందని తెలిపారు.