మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, తమపై నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించినందుకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీలో చేరికలు ఉంటాయని అన్నారు. బీజేపీలో చేరిన తరువాత ఈటల బృందం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లి కలవనున్నారు.