వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నది. యోగి సర్కార్ వైఫల్యాలు, కరోనా సమయంలో సర్కార్ చేసిన తప్పులు, ప్రజలు పడిన ఇబ్బందులు అన్నింటిని ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని చూస్తున్నది. యూపీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ యాక్టీవ్ గా ఉండటంతో ఆమెపై రాష్ట్రనాయకత్వం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది.
Read: ‘అల వైకుంఠపురములో’ని అందగాడి చేతుల మీదుగా ‘అల అమెరికాపురములో’ ప్రోమో!
ప్రియాంకగాంధీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమె సారధ్యంలోనే నడుస్తుందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ లల్లూ తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, ప్రజలు కూడా యోగి సర్కార్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు అజయ్ లల్లూ పేర్కొన్నారు.