కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత పూర్తిగా తగ్గిపోలేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారిలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. కరోనా నుంచి కోలుకుంటామా? ఈ జబ్బు తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే సందేహాలు కామన్ గా వస్తుంటాయి. కరోనా తీవ్రత రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది.
Read: బీజేపీకి శివసేన దగ్గరవుతుందా? ఫడ్నవిస్ వ్యాఖ్యలకు అర్ధం అదేనా?
ఒకటి శ్వాస త్వరత్వరగా తీసుకోవడం, రెండోది ఆక్సీజన్ 91 శాతం కంటే తక్కువకు పడిపోవడం. కరోనా తీవ్రతను అంచనా వేయడానికి ఈ రెండు కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ, ఉశ్చ్వాస, నిశ్చ్వాసలు వేగంగా జరుగుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఆక్సీజన్ 91 శాతం కంటే తక్కువగా నమోదైతే ప్రమాదమని చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు చెబుతున్నారు.