ప్రపంచంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మహమ్మారిని అరికట్టాలి అంతే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారే అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ తెలిపారు.
Read: మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్ బాబు ఆగ్రహం…
99 శాతం కరోనా మరణాలు వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచే నమోదవుతున్నట్టు ఫౌచీ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, మరింత వేగంగా వ్యాక్సిన్ ను అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు. అన్ని దేశాలు వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించాయని, అమెరికాలో అందరికీ సరిపడా టీకాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ ఆంటోని ఫౌచీ తెలిపారు.