పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక వందల ఆలయాలు పాక్‌లో ద్వంసం అయ్యాయి. అయినప్పటికి అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇటీవలే పురాతనమైన ఆలయపునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన పాక్ ప్రభుత్వం, ఒత్తిళ్ల కారణంగా వెకక్కితగ్గింది. ఇదిలా ఉంటే, కొన్నినెలల క్రితం ఖబర్ ఫంక్తున్సాలోని వందేళ్లనాటి హిందూ ఆలయం ఒకటి ద్వంసం అయింది. ఈ ఆలయం ద్వంసంపై అప్పట్లో 350 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చినెలలో హిందూ, ముస్లీంపెద్దల మధ్య జిర్గా సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో హిందూపెద్దలు ఆలయాన్ని ద్వంసం చేసిన ముస్లీంలను క్షమించారని పాక్ హోంశాఖ తెలయజేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేసినట్టు పాక్ హోంశాఖ పేర్కొన్నది.
Read: కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !