కరోనా తరువాత క్రమంగా అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగానికి అనుమతులు ఇవ్వడంతో దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకునే తాజ్‌మహల్ ను ప్రతిరోజు పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. నిన్నటి వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఉన్నది. తొలి సూర్యకిరణాలు తాజ్‌మహల్‌ను తాకే సమయంలో ఆ మహల్ బంగారు వర్ణంలో మెరిసిపోతుంది.
Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
అయితే, కరోనా ఆంక్షల కారణంగా ఉదయం 7 గంటల నుంచి సందర్శకులకు అనుమతి ఉన్నది. ఉదయం సమయంలో సుందరమైన ఆ దృశ్యాలను చూడలేకపోతున్నామని అనేక మంది టూరిస్టులు చెబుతున్నారు. ఆయితే, ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇవ్వడంతో తాజ్‌మహల్ సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.