ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇండియా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోంది. సభ్యదేశంగా కొనసాగుతున్న ఇండియాలకు ఇప్పుడు ఆ మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో భారత్ నెలరోజులపాటు కొనసాగుతుంది. ఇంతకు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొనసాగింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిది టిఎస్ తిరుమూర్తి బాధ్యతలు చేపట్టారు. భారత్‌కు ఈ పదవి వచ్చేందుకు ఫ్రాన్స్ సహకరించింది. ఈ ఆగస్టు నెలలోనూ అదే విధంగా తాత్కాలిక సభ్యదేశంగా తప్పుకునే చివరి […]
ప్రతినెలా 1 వ తేదీన చమురు, గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. ఈ సవరణల ప్రకారం 19 కేజీల వాణిజ్యగ్యాస్ ధర రూ. 73.5 పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలో వాణిజ్యగ్యాస్ సిలీండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1623, ముంబైలో రూ.1579.50, కోల్‌కతాలో రూ.1629, చెన్నైలో రూ.1761గా ఉన్నది. వాణిజ్యగ్యాస్ సిలీండర్ ధరలను పెంచినప్పటికీ, గృహవినియోగానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ ధరల్లో ఎలాంటి […]
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుమీద అమ్మే వస్తువు ఒక్కోసారి లక్షల రూపాయలు పలుకుతుంది. అది రోడ్డుమీర రూపాయే కావోచ్చు మార్కెట్లో దాని విలువ లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని వీధుల్లో ఓ వ్యక్తి పాతకాలం నాటి ఓ స్పూన్‌ను కొనుగోలు చేసింది. కేవలం 90 పైసలతో దానిని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ పాతకాలం నాటి స్పూన్‌ను సోమర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వస్తువులను వేలం వేసే పోర్టల్‌లో దానిని […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సినిమా థియోటర్లతో సహా అన్ని ప్రారంభమయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406 కి చేరింది. ఇందులో 6,32,728 మంది కోలుకొని డిశ్చార్జ్ […]
సౌదీ అరేబియాలోని ఓ లావా గుహను 2007 వ సంవత్సరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగోన్నారు. అయితే, ఆ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వివిధ రకాల జంతువుల అరుపులు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని శాస్త్రవేత్తలు విరమించుకున్నారు. కాగా, ఇటీవలే ఆ గుహలోకి శాస్త్రవేత్తలు సురక్షింతంగా వెళ్లగలిగారు. అలా గుహలోపలికి వెళ్లిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. గుహమొత్తం ఎముకలతోనే నిండిపోయింది. గుహలో మొత్తం 40 రకాల జంతువులకు సంబందించిన ఎముకలు బయటపడ్డాయి. Read: ఈ నెల 16 […]
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని నెలల క్రితం రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ను ధ్వంసం చేశారు. మరోసారి కొరియా యుద్ధం తప్పదేమో అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. అయితే, నెల రోజుల క్రితం నుంచి క్రమంగా మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో ద్వంసం చేసిన కార్యాలయాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఇరుదేశాల అధినేతలు హాట్‌లైన్‌లో మూడుసార్లు చర్చించుకున్నారు. కొరియా మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. […]
గత కొంత కాలంగా తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలలకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే తాలిబన్ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘన్ రక్షణ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్… ఈ వైమానిక […]
తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read: జగన్ […]
ప్రపంచంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. చలి తీవ్రత ఉండే ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ధృవప్రాంతాల్లోని మంచు ఫలకాలు వేడి గాలులకు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్రంలోకి నీరు అధికంగా చేరుతున్నది. ఇక గ్రీన్‌లాండ్‌లోని మంచు వేగంగా కరుగుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కరిగిన మంచు అమెరికా రాష్ట్రంలోని ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయ్యగలదని పర్యావరణ […]