ప్రపంచంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. చలి తీవ్రత ఉండే ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ధృవప్రాంతాల్లోని మంచు ఫలకాలు వేడి గాలులకు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్రంలోకి నీరు అధికంగా చేరుతున్నది. ఇక గ్రీన్‌లాండ్‌లోని మంచు వేగంగా కరుగుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కరిగిన మంచు అమెరికా రాష్ట్రంలోని ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయ్యగలదని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు.
Read: 40 ఏళ్ళ ‘రాణికాసుల రంగమ్మ’
1950 నుంచి ఈ ప్రాంతంలో మంచు కరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా ఇప్పటి వరకు మూడుసార్లు మంచు కరిగినట్లు తేలింది. అంటార్కిటికా తరువాత గ్రీన్‌లాండ్‌లోనే శాశ్వత మంచుఫలకం ఉన్నది. ఇక్కడ మంచు మొత్తం కరిగితే ప్రపంచంలోని సముద్రాల నిటి మట్టం 6 నుంచి 7 మీటర్ల మేర పెరుగుతుందని హెచ్చిరిస్తున్నారు. వాతావరణంలో వేడి పెరగకుండా చూడాలని, చెట్లను పెంచాలని, ఉద్గార వాయువుల ఉత్పత్తిని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు చేయాలని వాతావరణవేత్తలు చెబుతున్నారు.