అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుమీద అమ్మే వస్తువు ఒక్కోసారి లక్షల రూపాయలు పలుకుతుంది. అది రోడ్డుమీర రూపాయే కావోచ్చు మార్కెట్లో దాని విలువ లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని వీధుల్లో ఓ వ్యక్తి పాతకాలం నాటి ఓ స్పూన్‌ను కొనుగోలు చేసింది. కేవలం 90 పైసలతో దానిని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ పాతకాలం నాటి స్పూన్‌ను సోమర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వస్తువులను వేలం వేసే పోర్టల్‌లో దానిని నమోదు చేశాడు. మధ్యయుగం కాలానికి చెందిన స్పూన్ కావడంతో దాని విలువ భారీగా పెరిగింది. రూ. 51,712 వద్ద ఉంచగా, రోజు రోజుకు ఆ స్పూన్‌కు బిడ్డింగ్ పెరుగుతూ వస్తున్నది. ఫైనల్‌గా దీనిని రూ.1,97,000లకు అమ్ముడు పోయింది. ట్యాక్స్‌లు వగైరా అన్ని కలుపుకొని రెండు లక్షలకు పైగా ఈ స్పూన్ అమ్ముడుపోయింది.
Read: కిమ్ సోదరి మరో హెచ్చరిక: సౌత్ కొరియా ఆ పని చేస్తే…