కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దేశంలో సూపర్ స్ప్రైడర్‌లుగా మారే కార్యక్రమాలను నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్య క్రమాలను నిర్వహిస్తే వాటి ప్రభావం మూడు వారాల తరువాత కనిపిస్తుందని, అత్యవసరమైతే తప్పించి ప్రయాణాలు చేయవద్దని, మహమ్మారిని ఎదుర్కొవాలంటే తప్పని సరిగా నిబంధనలు పాటించి తీరాలని ఆయన తెలిపారు. బూస్టర్ డోసులపై కూడా రణ్‌దీప్ గులేరియా స్పందించారు.
Read: సినిమాల్లోనూ ‘తీయని’ స్నేహబంధం!
దీనికి సంబందించి తగిన ఆధారాలు లేవని అన్నారు. చాలా ప్రాంతాల్లో మొదటి డోస్ పూర్తికాలేదని, అలాంటప్పుడు బూస్టర్ డోసుల గురించి మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండేంత వరకు వ్యక్తిగతంగా ఎవరూ సురక్షితం కాదని అయన పేర్కొన్నారు. ఏదైన ఒక ప్రాంతంలో కొత్త వేరియంట్ కనిపిస్తే ఆ తరువాత అది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోందని అన్నారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగాలని, అప్పటి వరకు ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.