కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అందాల కాశ్మీర్‌కు సందర్శకుల రాక మొదలైంది. దాల్ సరస్సులో విహరించేందుకు జమ్ముకాశ్మీర్ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అయితే, చాలాకాలంగా దాల్ సరస్సులో ఫ్లోటింగ్ ఏటీఎంను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఇప్పటికి నెరవేరింది. దాల్ సరస్సులో తెలియాడే ఏటీఎంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఏ ఫెర్రీపై ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లోటింగ్ ఏటీఎం దాల్ సరస్సులో అదనపు ఆకర్షణగా నిలవనున్నది. గతంలో 2004లో కేరళలోని కొచ్చిలో మొదటిసారి తెలియాడే ఏటీఎంను ఏర్పాటు చేశారు. కేరళ షిప్పింగ్ కార్పోరేషన్‌కు చెందిన ఫెర్రీలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఫెర్రీ ఎర్నాకులం-వ్యాపిన్ మధ్య తిరుగుతుంటుంది.
Read: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ఆక్రమణలకు అవినీతే కారణమా…!!!