నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగి వస్తుండటంతో దేశీంగా ధరలు తగ్గుతున్నాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి 44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర తగ్గి రూ.48,220 కి చేరింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.68,000 కి చేరింది.
Read: తాలిబన్ల వింత ప్రకటన… మా ఫైటర్‌లకు మహిళలను గౌరవించడం తెలియదు… నేర్పుతాం…