ఎమ్మెల్యేలకు తమ ప్రాంతంలోని సమస్యలు చెప్పుకుంటూ ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తుంటాయి. ఆ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువకుడి నుంచి విచిత్రమైన లేఖ వచ్చింది. చంద్రాపూర్ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాని తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, ఎంత ప్రయత్నించినా తనకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని, జులాయిగా తిరిగే వాళ్లకు, తాగుబోతులకు కూడా గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటున్నారని, కానీ తనకు లేరని, ఎలాగైనా తనకు ఒక గర్ల్ ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని లేఖలో ఆ యువకుడు పేర్కొన్నారు. మరాఠిలో రాసిన ఆ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో తనకు ఇలాంటి ఫిర్యాదులతో కూడిన లేఖలు రాలేదని, ఈ లేఖ రాసిన భూషణ్ జామువంత్ ఎవరనే విషయం కనుక్కొవాలని తన కార్యకర్తలకు తెలిపినట్టు ఎమ్మెల్యే సుభాష్ థోతే పేర్కొన్నారు.
Read: మూడో వేవ్ మూడు నెలల తరువాతే…!!