స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్‌తో భారత రక్షణశాఖ భారీ ఒప్పందం కుదుర్చుకున్నది. 56 సీ మీడియం 295 విమానాల కోనుగోలు చేసేందుకు రూ.20 వేల కోట్ల రూపాలయలతో ఒప్పందం కుదుర్చుకున్నది. సీ 295 మీడియం డిఫెన్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను కోనుగోలు చేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నది. కాగా రెండు వారాల క్రితమే ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. మొదట 16 సీ 295 విమానాలను 48 నెలల్లోగా భారత్‌కు అందించేలా ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన 40 విమానాలను ఎయిర్‌బస్ డిఫెన్స్, టాటా అడ్వాన్స్డ్ సిష్టమ్ కన్సార్టియం తో కలిసి ఇండియాలో తయారు చేయనున్నారు.
Read: తెలంగాణను వదిలి చాలా నష్టపోయాం… జేసీ దివాకర్ రెడ్డి…