గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల ఎంపీపీ పదవి ఎవరికి దక్కుంది అనేదానిపై ఉత్కంఠత నెలకొన్నది. దుగ్గిరాల ఎంపీటీసీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ 9 చోట్ల, వైసీపీ 8 చోట్ల, జనసేన 1 చోట విజయం సాధించింది. అయితే, ఎంపీపీ పదవి దక్కాలి అంటే కనీసం 9 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీకి 9 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ ఆపార్టీ ఎంపీపీ అభ్యర్థి షేక్ జబీనాకు కుల దృవీకరణ పత్రం రాకపోవడంతో టీడీపీ నేతలు ఈ ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి 8 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. మరోకరి సపోర్ట్ తప్పనిసరి. మరి జనసేన పార్టీ వైసీపీకి మద్ధతు ఇస్తుందా లేదా చూడాలి. ఆచంటలో కూడా ఇదేవిధమైన పరిస్థితులు ఎదురవ్వగా జనసేన టీడీపీకి మద్ధతు ఇచ్చింది.
Read: అసెంబ్లీలో జారిన పంచే… నవ్వు ఆపుకోలేకపోయిన స్పీకర్…