ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక, బాధిత రైతులను పరామర్శించేందుకు లఖీంపూర్‌కు బయలుదేరిన ప్రియాంకగాంధీని పోలీసులు అడ్డుకొని గృహనిర్భంధం చేసిన సంగతి తెలిసిందే. 28 గంటలుగా ఆమె గృహనిర్భంధంలోనే ఉండిపోయారు. గృహనిర్భంధంలోనే ఉంటూ నిరసనలు చేస్తున్నారు. ఇక, పంజాబ్ డిప్యూటీ సీఎం సిఖిందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, పంజాబ్ ఎమ్మెల్యేలను కూడా యూపీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు పోలీసులు. లఖీంపూర్ బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు.
Read: ఇండియాలో భారీ తగ్గిన కరోనా కేసులు