దేశంలో మళ్లీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మనదేశంలో అత్యధికంగా ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. అయితే, తుఫాన్, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో డిమాండ్‌కు తగినంత ఉల్లిపంట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంతమేర ఉల్లి ధరలు పెరుగుతాయి, ఎన్ని రోజులకు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కేజీ ఉల్లి పంట పండించేందుకు ఇప్పుడు 12 నుంచి 16 వరకు ఖర్చు అవుతుందని, రైతులు కనీసం కేజీ ఉల్లిని రూ.30 కి అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
Read: నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు…