రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాజస్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మహిళ కుమారులిద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సచిన్‌కు అల్ఫాన్సా అనే యువతితో 2018 డిసెంబర్ 18 […]
భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే చిన్నారుల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను భారత ఔషద […]
కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు. […]
లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్‌లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు […]
ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, […]
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్‌లో […]
పంజాబ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్ […]
మేషం:- ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వాక్‌చాతుర్యానికి మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృషభం:- స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగస్తులకు కలిసి రాగలదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ […]