దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశం ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ జలాల పరిధిలోని దీవులు, దేశాలు తమవే అని వాదిస్తోంది. తైవాన్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తైవాన్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆ దేశానికి సమీపంలో గువామ్ నావికాదళాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ఈ జలాల్లో పహారా కాస్తుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాటీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. […]
అక్టోబర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ పోటీలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు దేశాల జట్లు ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటి వరకు ఇండియా-పాక్‌లో 6సార్లు తలపడగా 5 సార్లు ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ […]
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. మెగా క్యాంపులు నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక కరూర్ జిల్లాలో వ్యాక్సిన్‌పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కవ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాబోయే ఆదివారం రోజున కూడా మెగా క్యాంపును నిర్వహిస్తోంది. వాలంటీర్లు ఎంత మందిని వ్యాక్సిన్ తీసుకోవాడానికి తీసుకొస్తే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి […]
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న టెస్లా కార్ల హెడ్ క్వార్టర్స్‌ను అక్కడి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నది. టెస్లా సీఈవో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో క్యాలిఫోర్నియాలోని అటోమోబైల్ రంగంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఎందుకని టెస్లా హెడ్ క్వార్టర్స్ ను మార్చాలి అనుకుంటుంది అనే దానిపై అనేకమైన సందేహాలు కలుగుతున్నాయి. కంపెనీ విస్తరణలో భాగంగానే హెడ్ క్వార్టర్స్‌ను తరలిస్తున్నట్టు ఎలన్ […]
బీజేపీలో కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యులను నిన్నటి రోజున ప్రకటించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు కొంతమందికి కార్యవర్గంలో చోటు దక్కింది. వీరితో పాటుగా విజయశాంతికి కూడా కీలక పదవిని అప్పగించారు. విజయశాంతికి జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. జాతీయ పార్టీ తెలంగాణపై పూర్తి దృష్టి సారించేందుకు సిద్దమైనట్టు తెలుస్తున్నది. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవిని కూడా అప్పగించడంతో తెలంగాణపై మరింత పట్టు సాధించవచ్చని పార్టీ […]
సరుకు రవాణ చేసే గూడ్స్ రైళ్లు మహా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి. ఇండియన్ రైల్వేలకు సరుకు రవాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్లను నడపడం వలన ప్రజా రవాణా రైళ్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజన్లతో కూడిన త్రిశూల్ రైలును తయారు చేసింది. ఇది పూర్తిగా […]
ఇప్పటి వరకు లద్దాఖ్‌లో అలజడులు సృష్టించిన చైనా కన్ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదే అని చెప్పి ఎప్పటి నుంచే చైనా వాదిస్తూ వస్తున్నది. ఇండియా అందుకు ఒప్పుకోకపోవడంతో రెండు దేశాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ వివాదం నడుస్తున్నది. ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్‌లో నిత్యం బలగాలు పహారా కాస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన 200 మంది జవానులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు. తవాంగ్‌లో […]
ప్రతి ఏడాది శబరమల యాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శబరిమల యాత్రకు లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తుంటారు. అయితే, కరోనా కారణంగా గతేడాది ఈ యాత్రను పరిమిత సంఖ్యకే పరిమితం చేశారు. కాగా, ఈ ఏడాది నవంబర్ 16 నుంచి తిరిగి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మార్గదర్శాకలు రిలీజ్ చేసింది. రోజుకు 25 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. […]
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్షలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు కరెంట్ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉండాలి. అప్పుడు వారి విద్య సాఫీగా సాగుతుంది. బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రం ఎన్నో రకాలుగా వెనబడి ఉన్నది. కానీ, ఇప్పుడు కొంతమేర అభివృద్ది చెందింది. కానీ, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. గ్రామాల్లో ఎప్పుడు […]