పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్‌లో బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా ఉన్నది. ఈ ప్రాంతంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. ఈసారి తీవ్రత అధికంగా ఉండటంతో మరణాలు సంభవించాయి.
Read: పంజాబ్ ఫైట్: ముఖ్యమంత్రుల మధ్య పెరిగిన మాటల యుద్ధం…