భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్‌సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్‌ఎస్) ఫేజ్-2లో కలాబ్‌గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే:
ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం.9 హైదర్‌నగర్, రాం నరేష్ నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్‌నగర్, ఎస్‌పీ నగర్
ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం.15 మియాపూర్, దీప్తినగర్, శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు
ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 23 నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్
ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం.32 బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, హైదరాబాద్ జలమండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.