రైతు తన నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? సిద్ధిపేట జిల్లా లో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా..? ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ..అవగాహన లేని వెంకట్రామిరెడ్డి ని కలెక్టర్ గా ఇన్నాళ్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు.
సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు జగ్గారెడ్డి. రైతులకు అండగా ఉంటాం. రైతులను ఇబ్బందులు కలిగే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రైతులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. సాయంత్రం లోగా క్షమాపణలు చెప్పకపోతే.. సిద్ధిపేట కలెక్టరేటును ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.
వెంకట్రామిరెడ్డి మైండ్ లో రియల్ ఎస్టేట్ ఉంది.
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజ్యాంగేతర శక్తి గా వ్యవహరిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల తో చేపట్టిన ప్రాజెక్టులు టూరిజం కోసమేనా.. సిద్ధిపేట కలెక్టర్ కామెంట్స్.. ప్రభుత్వ ఆలోచనా అనేది స్పష్టం చేయాలి అని డిమాండ్రా చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.. ఇక, రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు.