కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తన […]
రాష్ట్రఅవతరణ దినోత్సవం రోజున వైఎస్సార్ అవార్డుల కార్యక్రమాన్ని జరపడాన్ని ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధం లేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం తప్పని ఇది సరికాదని, మహానీయుడు పొట్టిశ్రీరాములును అవమానించడమేనన్నారు. పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పాణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అమరజీవికి ఓ దండ వేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర […]
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే కొందరూ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోల కీలక నాయకుడైనా హిద్మా కోసం పోలీసుల గాలింపులు ఆగడం లేదు. మావోలకు పట్టున్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోనూ వారు ఉనికిని కోల్పోతున్నారు. తాజాగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోలు లొంగిపోయిన అనంతరం జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ […]
వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును […]
యూపీ సంస్థ, ప్రమోటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదువజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు కంటే ఎక్కువ విలువైన బైక్ బాట్ కుంభకోణం యూపీలో వెలుగు చూసింది.దీనిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబిఐ) 15,000 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా […]
ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు అన్నారు. తెలంగాణ వచ్చినప్పటీ నుంచి సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తెలంగాణ యువత తీవ్ర మనో వేదనకు గురవుతుందని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగాలపై మాట తప్పి, మడమ తిప్పిన టీఆర్‌ఎస్ సర్కార్ వైఖరికి నిరసనగా కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ సమస్యపై నవంబర్ 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రదీప్‌రావు ప్రకటించారు. […]
బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని […]
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్‌ను ఫ్రీగా అందిస్తున్నారట. Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6 […]
ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ రికార్డ్ సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మొదటి వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. టెస్లా షేర్లు భారీగా లాభపడటంతో ఆయన ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. బిలినీయర్ల సంపాదన ఎలాగైతే పెరుగుతున్నదో, ప్రపంచంలో పేదల సంఖ్య, అకలితో అలమటించే చిన్నారుల సంఖ్య, పోషకాహారంతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. ఐరాసలో అనుబంద సంస్థగా ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ ఆకలిలో […]
బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు. హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో […]