భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలి: మంత్రి పెద్దిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును పరిశీలించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఛార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూగర్భ జలాలను వినియోగించే చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు. భూగర్భ జలాల వినియోగం పై కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు.
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
తాగు నీరు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాల విషయంలో ఛార్జీలు విధించొద్దన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా సరైన స్థాయిలో వినియోగించేందుకు, కేంద్రం రూపొందిం చిన నిబంధనల అమలుపై అధికారులు అధ్యయనం చేసి తగిన మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!