మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్. తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ప్రశంసలజల్లు కురుస్తోంది. చెన్నైలో తన కాన్వాయ్ వెళ్తుండగా అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో వెంటనే తన కాన్వాయ్ ఆపేసి అంబులెన్స్ వెళ్ళిపోనిచ్చారు. ఈవిధంగా స్టాలిన్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చెన్నైలో నేటి నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బడులు తెరిచారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్ […]
హైదరాబాద్ నాంపల్లిలో రెండు హత్యలు కలకలం రేపాయి. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలపై రాయితో మోది హత్యకు పాల్పడ్డారు నిందితులు. అలాగే, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా రాయితో తలపై బాది చంపేశారు. రెండు సంఘటనల్లో ఇద్దరిని హతమార్చిన వ్యక్తి ఒక్కడే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీ […]
తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించాం. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటుచేస్తాం అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అందుకోసం ప్రణాళికలు రూపొందించామని, డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. మార్చి లోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతాం. లేగాటో, డిబీఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారు. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఉద్యోగులంతా […]
విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించారు సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ లో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి ఇక్కడినుంచే కాదు ప్రక్క రాష్ట్రాలు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జీవో నెంబర్ 3454 ప్రకారం కొండలు అలాగే నదులు రానున్న రోజుల్లో […]
విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై యావత్ ఆంధ్రరాష్ట్రం భగ్గుమంటోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో విద్యార్ది లోకం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కానివ్వబోమని గర్జించారు. విశాఖ ఏవిఎన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీసు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యార్ది యూనియన్ లకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ నిరసన లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ […]
కరోనా మహమ్మారి విషయంలో వీలు దొరికినప్పుడల్లా చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ చైనాపై చాలా విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్ అని, బయోవెపన్ అని విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిశోధకులను వూహాన్‌లోకి అడుగుపెట్టనివ్వడం లేదని, వూహాన్ ల్యాబోరేటరీలో వైరస్‌ను తయారు చేసి అక్కడి నుంచి లీక్ చేశారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో చైనా మండిపడింది. ఎన్నికల సమయంలో కాస్త […]
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల […]
నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆటవిడుపుతో అలరించారు. తన నియోజకవర్గమయిన నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి. గతంలోనూ అనేక సార్లు రోజా కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు.
ఎలన్ మస్క్ 300 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపదను కలిగియున్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అదే విధంగా మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నది. తక్కువ ధరకే శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్రవేశించింది. […]