ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ రికార్డ్ సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మొదటి వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. టెస్లా షేర్లు భారీగా లాభపడటంతో ఆయన ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. బిలినీయర్ల సంపాదన ఎలాగైతే పెరుగుతున్నదో, ప్రపంచంలో పేదల సంఖ్య, అకలితో అలమటించే చిన్నారుల సంఖ్య, పోషకాహారంతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. ఐరాసలో అనుబంద సంస్థగా ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ ఆకలిలో ఇబ్బందులు పడుతున్నవారి ఆకలి తీర్చేందుకు ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నది.
Read: అమెజాన్ డెలివరి విమెన్‌కు కస్టమర్ ఫన్నీ టాస్క్..నెట్టింట వైరల్…
ఇందులో భాగంగా ఎలన్ మస్క్ ను కూడా ఈ సంస్థ సంప్రదించింది. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారి ఆదుకోవడానికి ఫండింగ్ కోరింది. 6 బిలియన్ డాలర్లు ఫండింగ్ కోరినట్టు మీడియాలో వార్తులు వస్తున్నాయి. దీనిపై ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 6 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని పేదల ఆకలి తీరుతుంది అంటే డోనేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, సంతృప్తికరమైన ఓపెన్ ప్లానింగ్‌తో ముందుకు రావాలని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు సవాల్ విసిరారు.
దీనిపై డబ్ల్యూఎఫ్‌పీ రిప్లై ఇచ్చింది. తమ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఎలన్ మస్క్ సంపదలో 2శాతం డోనేషన్ చేస్తే ప్రపంచలోని 42 మిలియన్ మంది ఆకలి తీర్చగలుగుతామని, అదే 8.4 బిలియన్ డాలర్లతో 115 మిలియన్ మందిని ఆకలి నుంచి కాపాడగలుగుతామని, ప్రస్తుతం తమ లక్ష్యం 6 బిలియన్ డాలర్ల కంటే అధికం అని, వీలైనంతమంది ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూఎఫ్‌పీ డైరెక్టర్ డేవిడ్ తెలిపారు.