విధి ఆడే చదరంగంలో మనం ఓడిపోతూ వుంటాం. అన్నీ బాగున్నాయనుకునేలోపే అంచనాలు తలక్రిందులవుతాయి. కష్టపడి డబ్బు ఒక్కోసారి అక్కరకు రాకుండా పోతుంది. గుండె ఆపరేషన్ కొరకు కష్ట పడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా వుంటుంది. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీ కి చెందిన షేక్ మహబూబ్ బాషాకి అలాంటి పరిస్థితి ఎదురైంది. నాలుగు నెలలు క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి […]
అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ కి “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం ఫలించబోతోంది. ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టినప్పుడు బండి సంజయ్ ఈ మాటలన్నారు. కాషాయపు కంకణం కట్టుకుందాం కమలం పువ్వును గెలిపిద్దామని అప్పుడు పిలుపునిచ్చారు. కరెన్సీ నోట్ కు […]
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి. ఇక […]
తిరుపతిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోయారు. బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగారు తిరుపతి పోలీసులు. మూడు సెల్ ఫోన్లు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్ వద్ద ఘటన జరిగింది. ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగిన టి 20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసుల దాడిలో అరెస్టయిన వారిని కోనేటి వీధికి చెందిన షేక్ ఆఫ్రిద్, వైకుంఠపురంకి చెందిన […]
బద్వేల్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో అధికార వైసీపీ ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ జరిగినప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు తెలిపాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిమీదనే అందరి దృష్టి నిలిచింది. Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు బద్వేల్ ఉప […]
బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతను, కౌంటింగ్ కేంద్రాల వద్ధ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తాజా సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నది. Read: లైవ్ అప్డేట్స్: […]
దీపావళి సందడి దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. అలాగే, దీపావళి బాణసంచా దుకాణాల్లో పేలుళ్ళు ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు. విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్ […]
గత నెల 30 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని హుజురాబాద్, బద్వేల్ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలను జరిగాయి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, బద్వేల్ ఎమ్మెల్యే మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయింది. గత సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనుకున్నా, బీజేపీ బరిలో దిగడంతో ఎన్నిక నిర్వహించక తప్పలేదు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికలు సజావుగా ముగిశాయి. […]
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గత నెల 30న జరిగింది. ఫలితాల కోసం రెండురోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు. హుజురాబాద్ కౌంటింగ్ ప్రారంభమయింది. హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి […]