బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు.
హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బాణా సంచా పేల్చడంపై ఆయా ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్నాయి. టపాసులు విపరీతంగా పేల్చడంతో కాలుష్యం పెరుగుతుందని ఢీల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.