అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ కి “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం ఫలించబోతోంది. ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టినప్పుడు బండి సంజయ్ ఈ మాటలన్నారు. కాషాయపు కంకణం కట్టుకుందాం కమలం పువ్వును గెలిపిద్దామని అప్పుడు పిలుపునిచ్చారు.
కరెన్సీ నోట్ కు కమలం పువ్వుకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ హుజురాబాద్ ఎన్నిక అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. KCRకు సూటిగా సవాలు విసురుతున్నా. హుజురాబాద్ లో తెరాస ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా ? అని గతంలో సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయడానికి ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టుకున్న అర్జీలను చింపి చెత్త బుట్టలో వేశారని బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈటల మళ్లీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. సేవ చేసేవారినే ప్రజలు గెలిపిస్తారన్నారు బండి సంజయ్. అక్టోబర్ 30న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ మంగళవారం జరిగింది. ప్రతిరౌండ్లోనూ ఈటల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు తలక్రిందులయ్యాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. యువకుడికంటే రాజకీయాల్లో అనుభవం వున్న రాజేందర్ కే జనం పట్టం కట్టారంటున్నారు. సిరిసిల్లలో అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. ప్రతీ రౌండ్ లో బీజేపీ ముందుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకె అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. హుజూరాబాద్ నుండే పతనానికి నాంది. కేసీఆర్ అహంకారం..అణచివేతకు ఫలితం ఇది. ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసిన మోసం దళిత బంధు అన్నారు డీకె అరుణ.