ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న […]
తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు […]
అల్పపీడనం,భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు.నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి,సూళ్లూరుపేట,వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్ల పై నడవలేనంతగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లు దారుణంగా పాడైపోయాయి. నెల్లూరు నగరంలో చాలా చోట్ల నీరు చేరి నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్ల పై తిరగలేక,అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమ ఇక్కట్లు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని […]
వరంగల్ కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటి పల్లి, జవహర్ నగర్ కాలనీలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి అధ్వర్యంలో హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి, హన్మకొండ, సుబేదారి, మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు మరో 72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 బెల్ట్ […]
దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం, కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం, వెండి నగలు మాయం అయ్యాయి. రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్, డాగ్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. సీసీ టీవీల ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయంలో చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత వారసత్వ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జయ లలిత సమాధి దగ్గర ప్రేమ అనే మహిళ నివాళులర్పించింది. తాను జయలలిత కుమార్తెను అని ప్రేమ ప్రకటించుకుంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది ప్రేమ. దీంతో ఆమెకు శశికళ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో శశికళను ప్రేమ కలవనున్నారు. తానే జయ వారసురాలినంటూ ప్రేమ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. మరో మూడురోజుల్లో శశికళను కలుస్తానన్నారు. ఆమెకు శశికళ […]
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం […]
ఏపీలో ప్రధాన ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇతర ఎయిర్ పోర్టుల ప్రగతిపై అధికారులు ఫోకస్ పెట్టారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు అధికారులు. ఈ సమీక్షలో ఎయిర్ పోర్ట్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్వీరాన్మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. హైజాకింగ్ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయంలోకి జంతువులు, పక్షులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పొల్యూషన్ […]
సీజన్ ముగిసింది కానీ టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో టమోటా ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కిలో రూపాయికి పడిపోయిన టమోటా ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం […]