టమోటా ధర పైపైకి.. అక్కడ కేజీ రూ.75
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజన్ ముగిసింది కానీ టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో టమోటా ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
గతంలో కిలో రూపాయికి పడిపోయిన టమోటా ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పైగా పెరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పుల కారణంగా అంతంత మాత్రమే నాణ్యత ఉండటంతో టమోటా ధరలు పెరిగాయి. నాణ్యత ఎక్కువగా వున్న టమోటాల ధర పెరుగుతోంది. వ్యాపారుల మధ్య పోటీతో ధరల్లో భారీ తేడా కనిపిస్తోంది.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన

మదనపల్లె మార్కెట్‌లో 30కిలోల బాక్స్ ధర రూ. 2వేలు పలికింది. గుర్రంకొండలోనూ రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో 15కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యికి పైగా పలికింది. ఇక రీటైల్ మార్కెట్లలో కొండెక్కాయి. పీలేరులోని రీటైల్ మార్కెట్‌లో కిలో టమోటాలు రూ.75 పలికాయి. ఆదివారం కూడా అదే ధరలు వుండవచ్చంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?