రాష్ర్టంలో తాను చేస్తున్న పర్యటనల్లో జరుగుతున్న ఘర్షణలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. రైతుల కోసం రాళ్ల దాడులనైనా భరిస్తామన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకే వత్తాసు పలుకుతుం దన్నారు. రైతుల తో మాట్లాడుతుంటే రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, 70మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. దాడులు జరుగు తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులపై దాడులు జరిగినా స్పందించడం […]
మనదగ్గర ఒట్టిపోయిన ఆవులను కబేళాకు తరలించి వధిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో ఆవులను కేవలం ఆహారం కోసమే పెంచుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఆవును కబేళాకు తరలించాడు. అక్కడ దానిని వధించేందుకు సిద్ధం కాగా వారి కళ్లుకప్పి ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అక్కడే ఉంటే పట్టుకుంటారని భావించిన ఆ గోవు 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది. Read: ఉత్కంఠభరితంగా సాగిన బ్రెజిల్- […]
జలమండలి ఉద్యోగులకు తెలంగాణ రాష్ర్ట సర్కార్ తీపి కబురు చెప్పింది. జలమండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆమోద ముద్రను వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా తెలిపింది. నవంబర్ మాసం నుంచే వేతనాలను చెల్లించడానికి కేసీఆర్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. గత కొన్ని నెలలుగా జలమండలి […]
ఖతర్ వేదికగా వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2022 జగరబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. దక్షిణ అమెరికా టాప్ 10 లో బ్రెజిల్ 35 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో నిలవగా, అర్జెంటైనా 29 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే బ్రెజిల్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఇక ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భాగంగా బ్రెజిల్-అర్జెంటైనా జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి […]
కాంట్రావర్సీ క్వీన్ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ అన్నారు. కంగనా రనౌత్ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి […]
ఇండియా… పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాశ్మీర్ అంశం తరువాత రెండు దేశాల మధ్య మరింత దూరం పెరిగింది. కాగా, సుదీర్ఘకాలంగా మూసుకున్న సరిహద్దులు తిరిగి తెరుచుకోబోతున్నాయి. గురునానక్ జయంతోత్సవాల్లో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరుస్తున్నారు. ఈనెల 17 వ తేదీన ఈ కారిడార్ ను తెరవబోతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున […]
ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం బాగా పెరిగిందని, వైసీపీ పతనానికి ముహుర్తం కూడా ఫిక్స్ అయిందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ పై విరుచుకు పడ్డాడు. వైసీపీకి సమాధి కట్టడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీ పీకి ప్రజాదరణ పెరిగిందని ఆయన అన్నారు. ఈ విజయం సీఎం జగ న్ది కాదు.. డీజీపీదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వెళ్లి సీఎంని కల వడం కాదు.. […]
రేపు ఎల్లుండి సంఘ పరివార్ క్షేత్రాల కీలక సమన్వయ సమావే శాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగర శివారులో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. బీజేపీ, విహెచ్పీ, ఏబీవీపీ, బీఎంస్ తదితర సంస్థల నుంచి కొందరిని ఆహ్వనించను న్నట్టు వారు తెలిపారు. బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజే పీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షు డు లక్ష్మణ్ […]
నిరుద్యోగులు మాయగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతునే ఉన్నారు. తాజాగా ఈసీఐఎల్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానిని చెప్పి రవికుమార్ అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా 30 మందిని మోసం చేశాడు. 12 మంది బాధితుల నుంచి ఏకంగా నుంచి రూ.25 లక్షలు దోచేశాడు రవికుమార్ . రవికుమార్ ఈసీఐఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం…. రవికుమార్‌తో విస్తుపోయిన ఒక బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగం […]