ఖతర్ వేదికగా వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2022 జగరబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. దక్షిణ అమెరికా టాప్ 10 లో బ్రెజిల్ 35 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో నిలవగా, అర్జెంటైనా 29 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే బ్రెజిల్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఇక ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భాగంగా బ్రెజిల్-అర్జెంటైనా జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది.
Read: గుడ్‌న్యూస్: తెరుచుకోబోతున్న ఇండోపాక్ సరిహద్దులు…
ఈ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లు గోల్ చేయడం కోసం తీవ్రంగా శ్రమించాయి. మోకాలినొప్పితో బాధపడుతున్న అర్జెంటైనా కెప్టెన్ మెస్సీ బ్రెజిల్ తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. మైదానంలో చురుగ్గా కదిలినప్పటికీ గోల్ చేయలేకపోయారు. అవకాశాలు వచ్చినప్పటికీ రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. అటు బ్రెజిల్ కీలక ఆటగాడు నెయ్‌మర్ లేకపోయినా మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది బ్రెజిల్.