హైదరాబాద్‌లో యోధా లైఫ్‌లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు. వైద్యరంగంలో అనేక పెనుమార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో వైద్యం అందుబాటులోకి వస్తోందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీనోమ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జీన్స్ ను ఆధారంగా చేసుకొని మనిషికి వచ్చే జబ్బులను ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు. కరోనా సమయంలో జీనోమ్ […]
ఏదైనా ఇంటర్య్వూకు హాజరుకావాలంటే చేతిలో రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సిందే. ఎంత చిన్న లేదా పెద్ద కంపెనీ అయినా ఈ ప్రాసెస్ తప్పనిసరి. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు సభీర్ భాటియా. హాట్ మెయిల్ గురించి తెలిసిన వారికి సభీర్ భాటియా గురించి తెలుసు. హాట్ మెయిల్‌ను సృష్టించిన తరువాత ఆ మెయిల్ వ్యవస్థను మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు హాట్ మెయిల్లో ఎన్నో మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్. Read: వైరల్: భూమిపై […]
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. అతిథ్య న్యూజి లాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగలు చేసింది.కాగా ఆరంభంలోనే మిచెల్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ శుభారంభాన్ని అందిచాడు. 42 బాల్స్‌లో 70 పరుగులు చేశాడు. దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో బ్యాట్స్‌మెన్ చాప్మెన్ 63 పరుగులు చేశాడు. చాప్ మెన్ అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత ఫిలిప్స్‌ను […]
ట్రావెల్… అడ్వెంచర్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసేవారు లైఫ్‌లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటారు. అయితే, కొంతమంది టైం ట్రావెల్‌ను నమ్ముతుంటారు. టైమ్ ట్రావెల్ అంటే కాలంతో ప్రయాణించడం కాదు..కాలంలో ప్రయాణించడం. అంతే, గతకాలంలో లేదా రాబోయే కాలంలో ప్రయాణించడం అని అర్థం. ఇలాంటి విషయాలు కాల్పానిక నవల్లో లేదా సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఓ యువకుడు తాను కాలంలో ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నాడు. Read: సీఎంకు టీచర్లు […]
గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పలు గరుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా అనం తరం ప్రారంభమైనా పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌలిదొడ్డిలోని సోషల్ వేల్ఫేర్ గురుకుల బాలికల, బాలుర పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోని తర గతి గదులు, హాస్టల్ భవనం, మెస్హాల్ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. […]
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్‌లో తీన్మార్ మోగిస్తుంది. కారు పార్టీ పుల్ జోష్ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం, […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. ఆ దేశంలో ఉగ్రవాద శక్తులు బలం పుంజుకొని సాధారణప్రజలపై దాడులు చేస్తున్నారు. కొన్ని తెగల ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ రాజధానిలో వరసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జరిగింది. Read: ఈజిప్ట్‌లో బయటపడిన సూర్యదేవాలయం… ఏ కాలానికి చెందినదో తెలుసా… ఉదయం జరిగిన పేలుడు సంఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరోచోట బాంబు పేలుడు జరిగింది. […]
ప్రపంచంలో అనేక సూర్యదేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ దేశంలో సూర్యుడిని కొలుస్తుంటారు. ఇక పూర్వకాలంలో సూర్యుడికి నిత్యం పూజలు చేసే తెగలు అనేకం ఉన్నాయి. ఈజిప్ట్‌లో సూర్యుడిని వివిధ పేర్లతో పూర్వం కొలిచేవారు. ఆ దేశంలో సూర్యునికి అనేక ఆలయాలు నిర్మించారు. ఈజిప్ట్ పురావస్తుశాఖ నేతృత్వంలో అబు ఘరబ్ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఓ సూర్యుడి ఆలయం బయటపడింది. తవ్వకాల్లో బయటపడిన ఆ ఆలయం సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంగా పురావస్తు శాస్త్రవేత్తలు […]
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసి 24 గంటలు గవక ముందే ఏం చేశాడని, ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తు న్నారని హనుమంతరావు కేసీఆర్‌ను ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో కేసీఆర్ ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ […]