నిర్మలమైన ఆకాశం, స్వచ్చమైన సముద్రం, సముద్రానికి అనుకొని కొండలు… ఊహించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశంలో నివసించాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్న ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రిందట ఎలా ఉంటుందో ఊహించారా… ఊహించాల్సిన అవసరం లేదు… అర్కిటిక్ ప్రాంతానికి వెళ్తే మనకు ఇలాంటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం, కొండలు చల్లని వాతావరణం ఆహా అనుకుంటే పొరపాటే. అర్కిటిక్ ప్రాంతంలో సహజసిద్ధంగా దట్టమైన మంచు దిబ్బులు, మంచు కొండలు ఉండాలి.
Read: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్… ఇండియాలోనే…
కాని, క్రమంగా పెరిగిన గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడి పెరిగి ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతంలోని మంచు చాలా వరకు కరిగిపోయింది. సుమారు వందేళ్ల క్రితం దట్టమైన మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ఇప్పుడు మంచు కనిపించడం లేదు. వేడి కారణంగా మంచు విపరీతంగా కరిగిపోతున్నది. దీంతో సముద్రం మట్టాలు పెరుగుతున్నాయి. సముద్రాల్లో నీరు పెరగడం వలన అనేక చిన్న చిన్న దీవులు సముద్రంలో కలిసిపోయాయి. ఇలానే ఇంకొన్నాళ్లు జరిగితే సముద్ర తీరంలో ఉన్న అనేక నగరాలు, పట్టణాలు, దీవులు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది.