ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాను ఉద్యమకారుల అండతోనే పోటీలో ఉన్నాని తెలిపారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడడానికే నేను బరోలో ఉన్నాని రవీందర్ సింగ్ తెలిపారు. 12 ఏళ్లలో ఏనాడైనా ఎంపీటీసీలకు భాను ప్రసాద్ ఫోన్ చేశాడా అని ప్రశ్నించారు.
క్యాంపు రాజకీయాలతో, నోట్ల కట్టలతో విజయం సాధించాలని భాను ప్రసాద్‌రావు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన భాను ప్రసాద్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పని చేశారు? అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావు 12 రోజులైనా కరీంనగర్ లో ఉన్నారా..? ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు గురించి ఎప్పుడైనా మాట్లాడావా?పంచాయతీరాజ్ చట్టం గురించి మండలిలో ఒక్క మాట అయినా భానుప్రసాద్ మాట్లాడారా..? అని నిలదీశారు. ఉద్యమకారుల అండతో తప్పక విజయం సాధిస్తానని రవీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసే మాట్లాడే మాటలకు చేసే పనులకు పొంతన లేదని రవీందర్ సింగ్ ఎద్దేవా చేశారు.