స్వంత పార్టీకి చెందిన నేతపైనే అదే పార్టీకి చెందిన మహిళా నేత పంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి ప్రెస్ మీట్ పెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు లీలావతి. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు.
నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత మత్తుమందు ఇచ్చి తన వైపునకు తిప్పుకున్నాడని ఆమె ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి నుంచి మమ్మల్ని రక్షించే బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు లీలావతి. ఎమ్మెల్యేపై లీలావతి చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, వైసీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి.