నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు.
సన్న వడ్లు పండించిన వారికి ఐదు పైసలు బిళ్ళ లాభం రాలేదు. ఇప్పుడు వడ్లు పండించొద్దు అంటాడు దానికి కారణం కేంద్రం అని అంటారు. ఇక్కడ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ మన మిల్లులకు లేదు. మమ్మల్ని ఆదుకోండి అని మిల్లర్లు అడుకుంటున్నా వారిని పట్టించుకోరు. రాష్ట్రంలో ఒక క్వింటాలు వడ్లకు 10కిలోల తరుగు తీస్తున్నారు. దేశంలో ఉప్పుడు బియ్యం కొనే పరిస్థితులు లేవని రెండున్నర సంవత్సరాల నుండి ప్రత్యుత్తరాలు నడుస్తుంటే అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు వద్దు అంటున్నాడు.
ఈయన పరిస్థితి ఎలా ఉందంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. ఎన్నో కోట్ల పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎండాకాలం వడ్లు కొనడానికి అభ్యంతరం ఏమిటి? అన్ని పథకాలు కేంద్రం ఇస్తుందని అమలు చేస్తున్నావా?ఇప్పటికైనా చెంపలేసుకొని వడ్లు కొనుగోలు చేయకపోతే పుట్టగతులు ఉండవు. 75శాతం ప్రజలు మీ పాలన బాగాలేదు అని సర్వే లో తెలుస్తోంది.తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందన్నారు ఈటల.