స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీలలో బయట పడింది అక్రమ బంగారం గుట్టు. బంగారం సీజ్ చేసి కొలంబో ప్రయాణీకుడి పై కేసు నమోదు చేశారు. కేసుని దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం స్మగ్లింగ్ వర్థిల్లుతోంది.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి వద్ద 15.71 లక్షల విలువ చేసే 316.40 గ్రాముల బంగారం సీజ్ చేశారు. బంగారాన్ని ఏసీ కవర్‌లో దాచి తరలించే యత్నం చేశాడు మాయగాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్ లో అక్రమ బంగారం గుట్టురట్టయింది. బంగారం స్వాధీనం చేసుకుని ప్రయాణీకుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.