లాటరీ పద్ధతిలో బస్తీ వాసులకు ఇళ్ల కేటాయింపు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు.
Also Read: లాభాల్లో ఉన్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: గుత్తా సుఖేందర్‌రెడ్డి
Also Read
నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారన్నారు. మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇళ్ల విషయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!