టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గొప్ప విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీ కి ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ అలాగే ప్రతీకార రాజకీయాలు ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఓడిపోయాయి అని పేర్కొన్నారు. ఈ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను అని […]
తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 167 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 207 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,790 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,959కు పెరిగింది.. ఇక, […]
హుజురాబాద్ లో టీఆర్ఎస్ దే నైతిక విజయం అని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నన్ను ఓడించాయన్నారు. ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. ఇక, దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతాయి… కానీ, హుజురాబాద్ మాత్రం కలసి పని చేస్తాయని […]
హుజురాబాద్ లో బీజేపీ విజయం ప్రజల విజయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ కి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి, నా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో పాలక పార్టీ మభ్యపెట్టినా, వాటిని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేసి గెలిపించారు. హుజురాబాద్ ప్రజలు చరిత్ర తీరగరాశారు. […]
‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట చూడకుంటే మనసు కుదుటపడని వారు అప్పట్లో ఎందరో ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం […]
చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అందుకని మేకప్ భలేగా మెత్తదు. అలాగని ఆమెను చూసినా మొహం మొత్తదు. ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వెదజల్లింది. పలు భాషల్లో పరిణతి చెందిన నటిలా రాణిస్తోంది. నివేదా థామస్ 1995 నవంబర్ 2న చెన్నైలో జన్మించింది. […]
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ తెరకెక్కించారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,532 శాంపిల్స్ పరీక్షించగా.. 220 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 4 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 429 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,95,44,319 కు పెరగగా… మొత్తం […]
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మణిశంకర్’. యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె). కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ముందు కత్తులతో ఇంటెన్స్‌లుక్‌లో […]
ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ లోని సూపర్ 12 మ్యాచ్ లో నిన్న న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మేము ఈ మ్యాచ్ లో ధైర్యంగా లేము అని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు తనని అసహనానికి గురి చేసాయి అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. దాని పై కపిల్ దేవ్ […]