వెలుగొండ అడవుల్లో అదృశ్యమైన మూడేళ్ల బాలుడు సంజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చెప్పట్టారు. అయితే తొమ్మిది రోజులైనా బాలుడు దొరకలేదు. ఉయ్యాలపల్లితో పాటు పరిసర గ్రామాల్లో యువకులని బృందాలుగా ఏర్పాటు చేసి…పోలీసు, యువకుల బృందాలు విడిపోయి గాలిస్తున్నారు. ఉయ్యాల పల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో నేటి నుంచి గాలింపు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ లకు బాలుడి సమాచారం అందించారు. వాల్ పోస్టర్లను సోషల్ మీడియాకు విడుదల చేసిన పోలీసులు… […]
గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్స్ పై కరోనా నీలి నీడలు కముకున్నాయి. ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అక్కడ జపాన్ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతుండటంతో అత్యవసర సమావేశమైన ఒలంపిక్స్ నిర్వాహకులు ఈ గేమ్స్ కు అభిమానుల అనుమతి నిరాకరించారు. అయితే ఈ ఏడాది జరిగే ఒలంపిక్స్ 2021 ప్రేక్షకులు […]
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,393 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950 కి చేరింది. ఇందులో 2,98,88,284 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,58,727 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 911 మంది మృతి చెందారు. […]
తెలుగు రాష్ట్రల్లో ఆరంభంలో భారీగా పడిన వర్షాలు ఇప్పుడు తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో కూ6,357 క్యూసెక్కులు గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 811.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం […]
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే నిన్న శ్రీవారిని 17,736 భక్తులు దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు సమర్పించారు 7,838 మంది భక్తులు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం1.6 కోట్లుగా ఉంది. ఇక ఇదిలా ఉంటె తిరుమల సన్నిదానం అతిధి గృహం వద్ద చిరుత హల్ చల్ చేసింది. అడవిపందిని నోటికీ కర్చుకొని చిరుత సన్నిదానం అతిధి గృహం సెల్లార్ వద్దకు వచ్చింది. చిరుతను […]
ఏపీ ఆర్ధిక, రెవెన్యూ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.ఇప్పటి వరకూ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్ధికశాఖ నియంత్రణలో పని చేస్తాయని స్పష్టం చేసారు. ఆర్ధిక వనరుల నిర్వహణను […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటికి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి 3 సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ కె.వి.వి.గోపాలరావు, రిటైర్డ్ ఐఎఎస్సులు బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమించింది. పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాల వ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని తెలిపింది. జిల్లా స్థాయిలోనూ చైర్మన్లు, సభ్యులన నియమించింది. మూడేసి జిల్లాలకు […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,650 ఉండగా, […]
మేషం : వ్యాపారాలు దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వృషభం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. ఖర్చులు అధికారం. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలోని […]
హైదరాబాద్ లో ఉగ్రవాదులు పట్టుబడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం రహిత హైద్రాబాద్ కోసం బీజేపీ కి ఓటు వేయాలని అంటే మతతత్వ పార్టీ అన్నారు. ఇప్పుడు నగరం సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎవరి ప్రయోజనాల కోసం హోం మినిస్టర్ ఏం చేస్తున్నాడు. రోహింగ్యాలను తరిమి కొట్టడం మతతత్వం అయితే బీజేపీ మతతత్వ పార్టీ నే అన్నారు. బీజేపీ ఎప్పుడు ఇస్లాం, క్రీస్తవాన్ని విమర్శించలేదు. 48 […]