హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం, ఎంపి ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ యువజన సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ విప్ భాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… ఆనాడే కమలాపూర్ నియోజకవర్గ టీఆరెస్ కంచు కోట. 2004లో ఎమ్మెల్యే గా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఆరు సార్లు పార్టీ బీఫామ్ ఇచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యే గా, రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చారు […]
నిన్నటి ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి / షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 2.1కిమీ నుండి 5.8 కిమీ మధ్య వుంది. అల్పపీడనం ఈ నెల 11వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం & వాయువ్య బంగాళా ఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర ఏర్పడే అవకాశం వుంది. ఈ రోజు, […]
బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్ […]
రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా అభివర్ణించడం బాధాకరం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే… టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. రైతులను టీడీపీ నాయకులు మభ్యపెడుతున్నారు. గతంలోనూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది వక్రబుద్ధి అని తెలిపారు ఆయన. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే..ప్రజలు వారికి ఎన్ని స్థానాలు ఇచ్చారో తేలిపోతుంది. చంద్రబాబుతో […]
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్ […]
ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందా? అవునని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసిన ఆమె హాలీవుడ్ టాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీ ‘డబ్ల్యూఎమ్ఈ’ పేరు ప్రస్తావించింది. ‘ఎండీవర్’గా ప్రసిద్ధమైన సదరు టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ చాలా మంది టాప్ స్టార్స్ కోసం కూడా పని చేస్తుంటుంది. ఎమ్మా స్టోన్, గాల్ గాడోట్, ఓప్రా లాంటి వారు ఎండీవర్ ద్వారానే ఆఫర్స్ పొందుతుంటారు. నెక్ట్స్ ఆలియా కూడా అదే […]
ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఎల్.రమణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నా అని పేర్కొన ఆయన రాష్ట్రప్రగతిలో భాగసౌమ్యం కావాలని అనుకుంటున్నాను అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నిన్నవెళ్లి సీఎం కేసీఆర్ ను […]
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేఆర్ఎంబి బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశాను అన్నారు. కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరాను. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం “జలజీవన్ పథకం” […]
దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ లోతుగా విచారణ జరిపింది. ఈ బ్లాస్ట్ కేసులో 5 కు చేరింది నిందితుల సంఖ్య. ముగ్గురు నిందితులను వారం పాటు విచారించిన ఎన్ఐఎ కీలక ఆధారాలు సేకరించింది. ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ఇద్దరిని హైదరాబాద్ తీసుకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎన్ఐఏ.. పేలుడుకు వాడిన మెటీరియల్ కొనుగోలుతో పాటు వీరికి ఎవ్వరూ సహకరించారు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ సాగింది. నిందితులు వాడిన […]
జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలరుగా తిరిగి రామలింగరాజును నియమించారు గవర్నర్ హరిచందన్. గత మే నెలలో రామలింగరాజును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. వీసీ బాధ్యతలను ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. అయితే రామలింగరాజు తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు స్టేతో తిరిగి రామలింగరాజును వీసీగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు గవర్నర్ హరిచందన్.