బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్ వీలర్ కూడా ఒకటి…
రణవీర్ సింగ్ లెటెస్ట్ లగ్జరీ ఎస్ యూవీ ‘మెర్సిడీస్ జీఎల్ఎస్ 600’ కారు. ధర 2.43 కోట్లు మాత్రమేనట! ఇక బీ-టౌన్ సూపర్ స్టార్ గ్యారేజ్ లో ఉన్న మరో బ్యూటిఫుల్ బీస్ట్… మూడు కోట్లు విలువ చేసే ‘లంబార్గిని ఊరస్’! దేసీ కంపెనీ మారుతి సుజుకీ వారి ‘సియాజ్’ కూడా రణవీర్ కార్స్ కలెక్షన్లో ఉంది. అలాగే, చాలా మంది సెలబ్రిటీలు మోజుపడి కొనుక్కునే ‘రేంజ్ రోవర్ వోగ్’ సైతం ‘గల్లీ బాయ్’ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో ఈ టాలెంటెడ్ యాక్టర్ స్వంతం చేసుకున్న మరో ఖరీదైన కార్… 3.29 కోట్ల రూపాయల ‘యాస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్’. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ‘జాగ్వార్ ఎక్స్ జేఎల్, మెర్సిడీస్ జీఎల్ఎస్’ రాయల్ బ్రాండ్స్ కూడా మన మిష్టర్ అండ్ మిసెస్ రణవీర్, దీపికల పార్కింగ్ లాట్ లో కొలువై ఉన్నాయి!