దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ లోతుగా విచారణ జరిపింది. ఈ బ్లాస్ట్ కేసులో 5 కు చేరింది నిందితుల సంఖ్య. ముగ్గురు నిందితులను వారం పాటు విచారించిన ఎన్ఐఎ కీలక ఆధారాలు సేకరించింది. ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ఇద్దరిని హైదరాబాద్ తీసుకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎన్ఐఏ.. పేలుడుకు వాడిన మెటీరియల్ కొనుగోలుతో పాటు వీరికి ఎవ్వరూ సహకరించారు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ సాగింది. నిందితులు వాడిన ఫోన్స్, ఇంటర్నెట్, వాట్సాప్ చాటింగ్స్ పరిశీలిస్తున్న ఎన్ఐఏ… లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలతో మాలిక్ సోదరులకు ఉన్న లింకుల పై ఆధారాలు సేకరించింది. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో మాలిక్ సోదరులను విచారించిన ఎన్ఐఏ.. అనంతరం ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి తరలించింది. ఇక నేడు పాట్నా కోర్ట్ లో నిందితులను ప్రవేశ పెట్టనుంది ఎన్ఐఏ.