మేషం : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. రాజకీయ నాయకులు, సభలు సమావేశఆల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యం విషయంలో మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. వృషభం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన […]
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు. ప్రస్తుతం జూరాలకు 83,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా వస్తుండగా 86,673 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా… ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ […]
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.45,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల […]
నిన్న తిరుమల శ్రీవారిని 18195 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 7754 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా… హుండి ఆదాయం 1.24 కోట్లు గా ఉంది. అయితే రేపు శ్రీవారికి కోటి రూపాయలు విలువ స్వర్ణ కఠారిని కానుకగా సమర్పించనున్నారు హైదరాబాద్ కి చెందిన భక్తుడు యం యస్ ప్రసాద్. ఇక ఎల్లుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేయనుంది టీటీడీ. అయితే ఆగష్టు మాసంలో కూడా […]
ఏపీ సీఎంవోలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆయనకు కత్తెర పడింది. ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పించారు. తిరుగే లేదని అనుకున్న IAS విషయంలో సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంటి? ఎందుకు కోత పెట్టారు? అధికారుల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా అధికారి? లెట్స్ వాచ్! ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్‌పై అధికారుల్లో చర్చ ప్రవీణ్ ప్రకాష్. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో మిగిలిన ఐఏఎస్సుల్లాగానే ఈయనా ఓ ఐఏఎస్. కాకపోతే సీఎంవోలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే […]
ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరు. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసాను ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావు. బలహీనులు […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉంది. ఈ యేడాది మార్చి నాటికే ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తయిపోయింది. అయితే కరోనాతో పాటు అక్కౌంట్స్ నూ ఓ కొలిక్కి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఆ మధ్య సర్వసభ్య సమావేశం పెట్టి ఇకపై ఎన్నికలను సెప్టెంబర్ లో జరపాలని తీర్మానం చేశారు. ఇది ఎంతవరకూ చెల్లుతుందనే విషయాన్ని పక్కన పెట్టితే…. సెప్టెంబర్ లో కూడా ‘మా’ ఎన్నికలు జరగకుండా, మరికొంత కాలానికి వాయిదా వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు […]
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్ మార్చారట. మొత్తం కోల్ బెల్ట్‌ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి […]