నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నిజానికి దసరా కానుకగా శుక్రవారం విడుదల కావాల్సింది. కానీ పలు చిత్రాలు విడుదల కావడంతో దీనిని వాయిదా వేశారు. అయితే… ఇదే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల […]
ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో నువ్వా? నేనా? అనే రేంజ్‌లో ప్రత్యర్థులతో తలపడి ఫైనల్ దాకా వచ్చిన చెన్నై, కోల్‌కత… ఈరోజు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. కప్‌ను గెలుచుకునేందుకు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై ఇప్పటికే 3 సార్లు నెగ్గగా… కోల్‌కత రెండుసార్లు కైవసం చేసుకుంది. 2012లోనూ ఈ రెండు […]
శాంతి చర్చలలో ఆర్కె కీలకమైన వ్యక్తి అని ప్రో. హరగోపాల్ అన్నారు. చరిత్రలో అదో గీటు రాయి. చర్చలు సఫలం..విఫలం అనేది సమస్య కాదు. ఒక ముండడు పడింది. ఆర్కె లేని లోటు పార్టీ కి కొంత నష్టమే. పార్టీ స్థాపించిన వాళ్ళే బయటకు వచ్చారు. కానీ ఆర్కె నమ్మిన సిద్దాంతం కోసం పని చేశారు. ప్రభుత్వం వైద్యం అందించాలి అనుకోవడం మానవత్వం అని అన్నారు. కానీ ప్రభుత్వం వైద్యం అందిస్తుందని అనుకోవడం ఆశనే. మట్టుపెట్టలాని చూసే […]
ఆయన ఏదో ఈక్వేషన్‌తో ఈయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు. అంతా బాగానే ఉంది. ఈయనేమో.. నేను అప్పుడు అయన అల్లుడికి అంత నష్టం చేసినా… ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారు అంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకే పరిమితమైన ఆ ‘మా’ గొడవ ఇప్పుడు రాజకీయంగా తమను ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట. మోహన్‌బాబు కామెంట్స్‌తో ఇరకాటంలో టీడీపీ..! మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా […]
టీమిండియాకు తదుపరి కోచ్ భారతీయుడే అవుతాడని బీసీసీఐ అధికారి తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలా విదేశీ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కాగా అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ తదితరులు కోచ్ రేసులో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండనని ఇప్పటికే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత… ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో కొత్త కోచ్ ఎవరు ఏం చర్చ తెరమీదకు వచ్చింది. […]
1996లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది. వశిష్ట (రోషన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,946 శాంపిల్స్ పరీక్షించగా.. 586 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 9 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 712 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,89,24,891 కు […]
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్‌లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా […]
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టీడీపీ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో తప్ప టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. దీంతో ఆపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం క్రమంగా ఆపార్టీ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టగా మరికొంతమంది […]
హుజూరాబాద్‌లో గెలవటం ఎలా? ఏం చేస్తే గెలుస్తాం? ఒకటి డబ్బు ..రెండు హామీలు. కుల సమీకరణలు ఎలాగూ ఉంటాయి. కానీ వాటికి కూడా ఈ రెండే అవసరం. అధికార పార్టీ ఈరెండింటినే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. గులాబీ పార్టీ వారు ఓటుకు పది వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా బాగానే ముట్టచెపుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన బై […]